Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఒక్కరే కాదు, రాజధానిపై అపోహలు అనవసరం: మంత్రి బొత్స సత్యనారాయణ


‘చెప్పింది చేస్తాం...చేసేదే చెప్తాం..’ ఇదే జగన్‌ సర్కార్‌ విధామని బొత్స స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు గృహ వసతి కల్పిస్తామని స్పష్టం చేశారు. 
 

botsa satyanarayana takes charges as minister
Author
Amaravathi, First Published Jun 15, 2019, 5:37 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని రాష్ట్రమున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధానిపై అపోహలు అనవసరమని ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

శనివారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ సీఎం వైఎస్‌ జగన్‌  ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం నాది అని పేదలు భావించే రీతిలో పాలన ఉండబోతోందన్నారు. 

‘చెప్పింది చేస్తాం...చేసేదే చెప్తాం..’ ఇదే జగన్‌ సర్కార్‌ విధామని బొత్స స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు గృహ వసతి కల్పిస్తామని స్పష్టం చేశారు. 

పేదలకు పక్కా గృహ నిర్మాణాలు, ఇళ్ల స్థలాలను మంజూరు చేస‍్తామని, పట్టణ ప్రాంతాల్లో అనాదిగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని తెలిపారు. విభజన తర్వాత పసికందు లాంటి ఏపీని చంద్రబాబు చిక్కిశల్యం అయ్యేలా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు మాజీ సీఎం చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీలు చేయడం అధికార విధుల్లో భాగమే అని, దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలు ఉన్నారని తెలిపారు. వారిని కూడా తనిఖీలు చేస్తున్నారని అయితే చంద్రబాబు తనిఖీపైనే నానా హంగామా చేయడం అంత అవసరం లేదన్నారు. 

తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెక్యూరిటీని తొలగించారని అదేమని అడిగితే మీకంతా రక్షణ అవసరం లేదని అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తన సెక్యూరిటీ విషయం పట్ల గత ప్ రభుత్వం అనుసరించిన విధానాలను గుర్తు చేశారు బొత్స. 

Follow Us:
Download App:
  • android
  • ios