అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది ఏపీ పోలీస్ శాఖ. చంద్రబాబు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదని స్పష్టం చేసింది. 

చంద్రబాబుకు కేటాయించిన భద్రతలో ఎలాంటి మార్పులేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు కాన్వాయ్ లోని అడ్వాన్స్ పైలట్ కారు మాత్రమే తొలగించినట్లు తెలిపారు. గతంలో మాదిరిగానే రోడ్డు క్లియరెన్స్ కొనసాగుతోందని తెలిపింది. 

జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం భద్రతను కుదించిందని టీడీపీ నేతలు ఆరోపణలను పోలీస్ శాఖ ఖండించింది. ఇకపోతే చంద్రబాబుకు భద్రత తగ్గించారంటూ టీడీపీకి చెందిన పలువురు నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

హోదాపై 14వ ఆర్థికసంఘం అడ్డు చెప్పలేదు, లేఖ బయటపెట్టిన సీఎం జగన్: మోదీకి అందజేత

చంద్రబాబుకు మావోల నుంచి థ్రెట్ : టీడీపీ ఎమ్మెల్యేల అర్థనగ్న ప్రదర్శన

గన్నవరం విమానాశ్రయంలో బాబుకు తనిఖీలు: ఘాటుగా స్పందించిన విజయసాయి

చంద్రబాబు ఒక్కరే కాదు, రాజధానిపై అపోహలు అనవసరం: మంత్రి బొత్స సత్యనారాయణ