పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత?: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్
సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఏపీ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నాడు స్పందించారు. సినిమాలు తీయడానికి అయ్యే ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యూనరేషన్ ఉంటుందని ఆయన చెప్పారు. హీరోలు తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకోవాలని మంత్రి అనిల్ సూచించారు.
నెల్లూరు: సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంపై టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీకి చెందిన మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ హీరో నానిపై సెటైర్లు వేశారు.
తెలుగు సినీ హీరో నాని సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సినిమా థియేటర్ల కంటే థియేటర్ పక్కన ఉండే కిరాణ దుకాణానికి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని అంటూ ఏపీ ప్రభుత్వంపై హీరో Nani కామెంట్స్ చేశారు.ఈ వ్యాఖ్యలపై మంత్రి Anil kumar శుక్రవారం నాడు స్పందించారు.
also read:సినిమా టికెట్ల ధరల ఎఫెక్ట్.. 55 థియేటర్లు మూత, తాళాలు వేసుకున్న యజమానులు
హీరో నాని వ్యాఖ్యలను గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన భజనపరుడంటూ విమర్శించారు. సినీ పరిశ్రమలో దోపీడీని అరికట్టేందుకే టికెట్ల ధరలను తగ్గించినట్టుగా మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యూనరేషన్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని మంత్రి చెప్పారు. హీరోలు తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకోవచ్చు కదా అని ఆయన హీరోలను ఉద్దేశించి ప్రశ్నించారు.వకీల్ సాబ్, బీమ్లానాయక్ సినిమాలకు అయిన ఖర్చెంత, పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత అని ఆయన ప్రశ్నించారు. అభిమానిగా హీరోల కటౌట్లు కట్టి తానూ నష్టపోయానని మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేసుకొన్నారు.Cinema Tickets ధరలను తగ్గించడాన్ని ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు మాత్రం కడుపు మంట కలుగుతుందని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ 35 నెంబర్ జీవోను ఇటీవల జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు .
అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన 35 నెంబర్ జీవోను ఈ నెల 14న రద్దు చేసింది.పాత విధానంలోనే టికెట్ల రేట్లుంటాయని ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై జాయింట్ కలెక్టర్లు నిర్ణయం తీసుకొంటారని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 16న ఆదేశించింది. అయితే కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యజమానులకు మినహా రాష్ట్రం మొత్తం 35 నెంబర్ జీవో అమల్లో ఉందని ఏపీ ప్రభుత్వం అదే రోజున ప్రకటించింది.
సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాఘవేంద్రరావు సహా కొందరు సినీ ప్రముఖులు ఈ విషయమై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.ఈ విషయమై తమకు ఉన్న అభ్యంతరాలపై ప్రభుత్వంతో చర్చించాలని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం నాడు సూచించిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల ధరలను ఇష్టారీతిలో పెంచుకొనే విధానానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. దీంతో సినీ పరిశ్రమ తమకు నష్టం వస్తోందని చెబుతుంది