సారాంశం

నోరు అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలిసి వచ్చిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.

అమరావతి: వైఎస్ రాజశేఖర్ రెడ్డే తనను ఏం చేయలేదు.. ఆయన కొడుకు  ఏం చేస్తాడని చంద్రబాబు సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని  మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.బుధవారంనాడు గుంటూరులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఏం చేస్తారో జగన్ చంద్రబాబు చూపించారన్నారన్నారు. జగన్  దెబ్బకు చంద్రబాబు  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారన్నారు. భయమంటే  జగన్ కు చూపిస్తానని లోకేష్  కూడ వ్యాఖ్యలు చేశారని  మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని  లోకేష్ కు మంత్రి అంబటి రాంబాబు సూచించారు.

17ఏ సెక్షన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని  మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.కానీ, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  అవినీతి జరగలేదని  మాత్రం టీడీపీ నేతలు చెప్పడం లేదన్నారు. 

పచ్చగా ఉన్న టీడీపీ సర్వనాశనం కావడానికి లోకేష్ కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్యేగా కూడ విజయం సాధించని లోకేష్ ను   మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. లోకేష్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే  టీడీపీకి ఈ  పరిస్థితి నెలకొందని ఆయన  విమర్శలు చేశారు.

also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: రెండో రోజూ సీఐడీ విచారణకు లోకేష్

జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించిన తర్వాత  టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు ప్రస్తావించారు. ఆ తర్వాత వారాహి యాత్రలో టీడీపీ బలహీన పడిందని  ఆ పార్టీపై విమర్శలు చేశారన్నారు. టీడీపీ బలహీనపడిందని  వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ కు మంత్రి అంబటి రాంబాబు చురకలంటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. కానీ జనసేన ఎన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుందని ఆయన ప్రశ్నించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో బస్సు యాత్ర చేపడుతామన్నారు. నవంబర్ 1వ తేదీ నుండి వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.