నీ జబర్దస్త్ వేషాలు ఇక్కడ కావు..మంత్రి ఆది

ap minister aadi narayana fire on ycp mla roja
Highlights

రోజాకి మంత్రి ఆదినారాయణ సెటైర్

మంత్రి ఆదినారాయణ రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సెటైర్ వేశారు.  నీ జబర్దస్త్ వేషాలు రాజకీయాల్లో పనికి రావంటూ రోజాని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రోజాపై విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.  

రోజా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాల్లో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రోజా రాజకీయాలు వదిలి సినిమాలు, సీరియల్స్‌కు పరిమితం కావాలని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేవన్ని అబద్దాలని... జగన్ జైలు కెళ్లడం ఖాయమని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

loader