మృతదేహంలో కరోనా వైరస్ ఎంతసేపు వుంటుందంటే...: ఏపీ వైద్యశాఖ కార్యదర్శి

కరోనా వైరస్...ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తోంది. ఒకరి నుండి మరొకరికి సోకే లక్షణాన్ని కలిగివున్న ఈ వైరస్ మనుషుల్లో ఇప్పటికే అడుగంటుకు పోయిన కాస్త మానవత్వాన్ని కూడా చంపేసింది. 

AP Medical and Health Special Secretary  Jawahar Reddy Comments ON COVID19 Outbreak

అమరావతి: కరోనా వైరస్...ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తోంది. ఒకరి నుండి మరొకరికి సోకే లక్షణాన్ని కలిగివున్న ఈ వైరస్ మనుషుల్లో ఇప్పటికే అడుగంటుకు పోయిన కాస్త మానవత్వాన్ని కూడా చంపేసింది. ఇంతకాలం బ్రతికుండగా పట్టించుకోకపోయినా చనిపోయాక చివరిసారి చూడటానికయినా వెళ్లేవారు. కానీ ఈ కరోనా కారణంగా సన్నిహితుల అంత్యక్రియకు కూడా చాలామంది దూరంగా వుంటున్నారు.  

ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే కరోనాతో మృతిచెందిన వారి శవాలను కూడా గ్రామాల్లోకి తీసుకురానివ్వడం లేదు. ఇలా దేశంలోనే కాదు తెలుగురాష్ట్రాల్లోనూ పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో వున్న అనుమానాలను  నివృత్తి చేసి ఇలా అంత్యక్రియలను అడ్డుకోవడాన్ని ఆపాలని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మృతదేహాల్లో ఈ వైరస్ ఎంతకాలం సజీవంగా వుంటుందో తెలియజేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి. 

read more   బిగ్ బ్రేకింగ్... ముఖ్యమంత్రి జగన్ తో కరోనా సోకిన ఎమ్మెల్యే

''మృతదేహంలో కరోనా వైరస్ కేవలం 6గంటలు మాత్రమే సజీవంగా వుంటుందని... ఆ తర్వాత వైరస్‌ ఉండదన్నారు. కాబట్టి తాము కూడా కరోనాతో మృతిచెందిన వారిని వెంటనే కుటుంబసభ్యులకు అప్పగించడం లేదని తెలిపారు. మృతదేహంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాకే కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నామని... కాబట్టి  కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకుని ఇబ్బందులు పెట్టొద్దని జవహర్ ప్రజలకు సూచించారు. 

ఇక రాష్ట్రంలో ఒక్క కరోనా మృతి ఉంటే 666 కేసులు ఉన్నట్టేనని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర రవాణా వల్ల ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకరి నుంచి 1.12 మందికి కరోనా సోకుతోందని... ఇది రెండు దాటితే మనం ప్రమాదంలో ఉన్నట్టని అన్నారు. 

ఇప్పుడున్న వైద్యులపై భారం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాజాగా వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. 


   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios