అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై గందరగోళం ఏర్పడింది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ విధమైన ఏర్పాట్లు జరగలేదు. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాణ భర్త గుప్తాను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. 

అయితే ఎస్ఈసీ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు. ఈ స్థితిలో జిల్లా స్థాయిలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఎస్ఈసీతో జరిగే వీడియో సమావేశంలో ఎవరు పాల్గొంటారనే విషయంపై కూడా స్పష్టత రాలేదు. జాయింట్ కలెక్టర్ పాల్గొంటారా లేదా అనేది తేలలేదు. 

Also Read: తొలి దశ నోటిఫికేషన్ జారీ : ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదీ...

అది విధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సెలవుపై వెళ్లారు. ఆయన ఈ నెల 25వ తేదీ వరకు సెలవు పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సెలపు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంజార్జీ కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 

కాగా, ఎన్నికల విధుల్లో కచ్చితంగా పాల్గొంటామని కర్నూలు జిల్లా ఎస్పీ చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తామని, అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలను కూడా ఆచరిస్తామని ఎస్పీ చెప్పారు