Asianet News TeluguAsianet News Telugu

తొలి దశ నోటిఫికేషన్ జారీ : ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదీ....

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సైరన్ మోగింది. విజయవాడలోని ఎస్ఈసీ ఆఫీసులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 

Election notification released in andhrapradesh - bsb
Author
Hyderabad, First Published Jan 23, 2021, 11:37 AM IST

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సైరన్ మోగింది. విజయవాడలోని ఎస్ఈసీ ఆఫీసులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 

మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉప సర్పంచి ఎన్నికతో ముగుస్తుంది. 

జనవరి 23 : నోటిఫికేషన్ జారీ
జనవరి 25 : అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 27 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జనవరి 28 : నామినేషన్ల పరిశీలన
జనవరి 29 : నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
జనవరి 30 : అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31 : నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ( మద్యాహ్నం 3 గంటల వరకు..) 
అదే రోజు మద్యాహ్నం మూడు గంటల తరువాత అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 5 : పోలింగ్ తేదీ ( సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మద్యాహ్నం 3.30 మధ్య పోలింగ్ )
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మద్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉప సర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రకియ పూర్తవుతుంది.

రెండో దశ ప్రక్రియ ఇలా ఉండబోతోంది..

జనవరి 29 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
ఫిబ్రవరి 1 : నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 2 : నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 3 : ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 4 : నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ( మద్యాహ్నం 3 గంటల వరకు..) అదే రోజు మద్యాహ్నం మూడు గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 9 : పోలింగ్ తేదీ ( సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మద్యాహ్నం 3.30 మధ్య పోలింగ్ )
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీనితర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయడంతో రెండో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios