ఆంధ్ర వామపక్షాలు నిర్విరామంగా ప్రభుత్వానికి వ్యతి రేకంగా పోరాటం చేస్తున్నాయి విభజనలో నష్టపోయినా, ప్రత్యేక హోదా లబ్ది పోందేందుకు ప్రయత్నాలు రెండు పార్టీలు 2004 నాటి ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు కృషి
ఆంధ్ర వామపక్షాలలో సమరోత్సాహం ఉట్టిపడుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో వామక్షాలు నిరంతర పోరాటంలో ఉన్నాయి. కొత్త రాష్ట్రా నికి కార్యదర్శులయిన ప్పటి నుంచి సిపిఐ రామ కృష్ణ, సిపిఎం మధు కాళ్లరిగిపోయేలా దిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రచారం చేస్తున్నారు. బంద్ పిలుపులిస్తున్నారు. అరెస్టవుతున్నారు.
కొన్ని సందర్భాలలో వారి మీద దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో నెలకొల్పుతున్న ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఎం కార్యదర్శి మధును పోలీసు అరెస్టు చేశారు. సిపిఎం జాతీయ నాయకులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద యుధ్దం ప్రటించారు. ఆ మధ్య సిపిఎం జాతీయ నాయకుడు ఏచూరి సీతారాం, మహిళానేత బృందా కారత్ అమరావతి నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ వ్యపారంలో పోల్చారు.
రెండు వామపక్ష పార్టీలకు చాలా విబేధాలున్నా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఈ రెండు పార్టీలు కూడా జగన్ మద్దతునిస్తున్నాయి. జగన్ కూడా ఢిల్లీ వెళ్లినపుడల్లా సిపిఎం ఏచూరిని, సిపిఐ రాజా ను కలుస్తుంటారు. అంతా కలసి అనేక బంద్ లను నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆంధ్రా ప్రజలను వంచిస్తూ ఉందని ఏచూరి విమర్శించారు.
తాజాగా బుధవారం నాడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పార్టీ విధానాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రత్యేక హోదా కోసం పనిచేసే ఏ పార్టీతో నయినా కలసి నడుస్తామని చెప్పారు.విభజన హామీలను కేంద్రగాలికి వదిలేస్తున్నదని, ఆంధ్రాకు న్యాయం జరిగే వరకు ప్రతిపక్ష పార్టీలతో సిపిఎం కలసి పని చేస్తుందని మరొక వైపు మధు చెప్పారు.
ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీలు చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారనే నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయం మీద ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమని అంటున్నాయి. బుధవారం నాడు పేదల ఇళ్ల పట్టాల కోసం ఆయన విజయవాడలో పాదయాత్ర చేశారు.
రెండు వామపక్ష పార్టీలు రాష్ట్ర విభజన మీద పరస్పర వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో సిపిఐ విభజనను సమర్థించి నష్టపోతే, సిపిఎం వ్యతిరేకించి నష్టపోయింది. కొత్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాలుపెట్టలేకపోయాయి, ఆంధ్ర నుంచి ఇపుడు పార్లమెంటులో వామపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
అయితే, ప్రతేక హోదా ఈ రెండుపార్టీలకు కొత్త వూపిరి పోసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విషయం మీద వైఎస్ఆర్ సిపి నేత జగన్ తో కలసి ఐక్య పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఇది 2004 కు ముందు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి నాయకత్వం లో జరిగిన కరెంటు చార్జీల వ్యతిరేకం పోరాటాన్నిగుర్తుచేస్తున్నది. 2004 నాటి విశాల ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసి , తెలుగుదేశం, బిజెపి ప్రభుత్వాలకు వ్యతిరేకపోరాడి, 2019 ఎన్నికల ద్వారా అసెంబ్లీ, పార్లమెంటులో ప్రవేశించేందుకు వామపక్షాలు ప్రయత్నం చేసున్నట్లు కనిపిస్తుంది. జగన్ నేతృత్వంలో ఈ వ్యూహం విజయవంతమవుతుందేమో చూడాలి.
