ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 7 ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ (Inter Results) నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూడవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మే 12 నుంచి 20 తేదీల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
ఫలితాలను చూసేందుకు అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.inను సందర్శించవచ్చు. అంతేకాదు, విద్యార్థుల సౌలభ్యార్థం కోసం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే సదుపాయాన్ని ఇంటర్ బోర్డ్ అందిస్తోంది.
PDF రూపంలో…
వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవాలంటే, ముందుగా 9552300009 అనే నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపితే, విద్యా సేవల ఎంపిక వచ్చే మెసేజ్ వస్తుంది. అందులో ‘ఇంటర్ ఫలితాలు’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని, మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో ఫలితాలు PDF రూపంలో డిస్‌ప్లే అవుతాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ సప్లిమెంటరీ రాసినవారికి ఇది ఎంతో కీలకమైన ఘట్టం. అందువల్ల ఫలితాలు వచ్చిన వెంటనే తన హాల్ టికెట్ నంబర్‌తో ఆన్‌లైన్ లేదా వాట్సాప్ ద్వారా తన మార్కులు తెలుసుకోవచ్చు. అధికారికంగా విడుదలయ్యాకే ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది.

