Asianet News TeluguAsianet News Telugu

నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నాం: చంద్రబాబు భద్రతపై డీజీపీ సవాంగ్

ఇకపోతే రాజకీయ దాడులపై కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. అయితే వ్యక్తిగత వివాదాలను కూడా కొంతమంది రాజకీయ ముద్రవేస్తున్నారని వాస్తవాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. 

ap dgp goutham sawang gives clarity about chandrababu security
Author
Amaravathi, First Published Jul 1, 2019, 2:35 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇచ్చామని డీజీపీ స్పష్టం చేశారు. 

అమరావతిలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ గౌతం సవాంగ్ స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. స్పందన కార్యక‍్రమం పేరుతో ప్రతి ఎస్పీ, సీపీ కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

రాబోయే రోజుల్లో స్పందన కార్యక్రమాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే రాజకీయ దాడులపై కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. అయితే వ్యక్తిగత వివాదాలను కూడా కొంతమంది రాజకీయ ముద్రవేస్తున్నారని వాస్తవాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios