Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు భద్రతపై ఏపీ హైకోర్టులో వాదనలు, తీర్పు రిజర్వ్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతను తగ్గించడంపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది

hearing on tdp chief chandrababu security in ap high court
Author
Amaravathi, First Published Aug 1, 2019, 4:29 PM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతను తగ్గించడంపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

విచారణ సందర్భంగా గతంలో చంద్రబాబుకు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. బాబుకు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

24 గంటలూ ఒక్కరే విధుల్లో ఉంటే కష్టం కాదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే సమయంలో చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.

బాబు భద్రతా విధుల్లో మొత్తం 74 మంది ఉన్నారన్నాని ఏజీ కోర్టుకు వెల్లడించారు. చంద్రబాబుకు మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ప్రాణహానీ ఉందని బాబు తరపున న్యాయవాది న్యాయస్ధానం దృష్టికి తీసుకెళ్లారు.

ఇదే సమయంలో ఎన్ఎస్‌జీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు నివాసం, కార్యాలయంలో ఉన్నప్పుడు ఆయన భద్రతా బాధ్యతలు స్థానిక పోలీసులదేనని.. ఇదే సమయంలో బాబు జనాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎన్ఎస్‌జీ కమెండోలు భద్రత కల్పిస్తారని సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios