ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఏపీ రాజధాని ప్రాంతంలో వేరే ప్రాంతాలవారికి భూములిస్తూ...వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే హైకోర్టు ఇచ్చింది. గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన...51 వేలమందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ఆ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు.. జీవోను హైకోర్టులో సవాల్‌ చేశారు. అమరావతి పరిధిలో భూ సమీకరణ కింద తీసుకున్న భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం ఉందంటూ పిటీషనర్ వాదించారు. అయితే, కోర్టు దీని పైన తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ప్రభుత్వం తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మీద స్పందించాల్సి ఉంది.

Also Read నిమ్మగడ్డ రమేశ్ కుమార్తె శరణ్యపై జగన్ సర్కార్ ఫోకస్: జాస్తి కిశోర్‌ తరహాలో విచారణ..?

ఏపీ రాజధాని ప్రాంతంలో వేరే ప్రాంతాలవారికి భూములిస్తూ...వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే హైకోర్టు ఇచ్చింది. ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి..అందులో భాగంగా రాజధాని పరిధిలోని భూమలను ఎంపిక చేసింది. దీని పైన స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై కోర్టు స్టే విధించింది. 

అమరావతి గ్రామాల్లోని భూములను సీఆర్డీఏ చట్టం ప్రకారం దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రధాని మంత్రి ఆవస్ యోజన లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డఏ పరిధిలోనే వస్తాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, వాదనల తరువాత 51 వేలమందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 107 పైన స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది.