అమరావతి: రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై ఇవాళ్టి నుండి ఏపీ హైకోర్టు రోజువారీ విచారణ జరపనుంది. ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్లపై విచారణ జరగనుంది. 

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్‌రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై  రాజధాని రైతులు కేసులు వేశారు. సీర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంగానపై కేసులు నమోదయ్యాయి. అలాగే రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్‌పైనా, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైన రైతులు కేసులు వేశారు. అలాగే రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 సీఆర్పీసీ విధింపును ఛాలెంజ్ చేశాకె రాజధాని ప్రాంత రైతులు. 

పరిపాలన రాజధాని తరలింపు కోసం చేసిన చట్టం పై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. ఇలా రాజధానికి సంబంధించిన కేసులు, దాఖలైన పిటిషన్లపై నేడు ఆన్‌లైన్ ద్వారా  విచారించనుంది ధర్మాసనం. 

read more   రాజధాని తరలింపును అడ్డుకునే ప్రయత్నం...హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గెజిట్ ను నిలిపివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలుచేశారు. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజభవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. 

సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. దీంతో రాజధాని రైతు పరిరక్షణ సమితి ఆమోదం హైకోర్టును ఆశ్రయించింది.