గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్‌ను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పొడిగించింది. ఎస్ఈసీ యాప్‌పై ఈ నెల 17 వరకు స్టే పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

నిఘా లేదా సీ. విజిల్ యాప్ వినియోగించుకోవచ్చని ఎస్ఈసీకి కోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి 17న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. 

కాగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సీ విజిల్ యాప్ ఇప్పటికే ఉండగా, మళ్లీ కొత్తగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో యాప్ తీసుకురావడం సరికాదని, దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

Also Read:ఏపీ పంచాయితీ ఎన్నికలు2021...ఊపందుకున్న పోలింగ్, ఇప్పటివరకు 34శాతం ఓటింగ్

దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ఈ వాచ్ యాప్ మీద విచారణ జరిపింది. దీనికి భద్రతా పరమైన అనుమతులు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

దీనికి మరో 5 రోజుల్లో భద్రాపరమైన అనుమతులు వస్తాయని వాదించారు. దీంతో ఈ వాచ్ యాప్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9 వరకు యాప్‌ను అమల్లోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది.