చంద్రబాబుకు చుక్కెదురు: లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు నిరాకరణ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది.
అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మంగళవారం నాడు చుక్కెదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబు కు బెయిల్ నిరాకరించడంతో ఏపీ హైకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు గత నెల 14న బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏసీబీ కోర్టు తీర్పును ఈ నెల 9వ తేదీన వెల్లడిస్తామని ప్రకటించింది. మరో వైపు చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని గత నెల 25న సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏసీబీ కోర్టు నిన్న తీర్పును వెల్లడించింది.చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
also read:అవినీతి నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా చూడడమే 17 ఏ ఉద్దేశం: రాఫెల్ కేసును ప్రస్తావించిన సాల్వే
దీంతో ఇవాళ ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్లను దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్‌టీవీ కథనం ప్రసారం చేసింది.దీంతో రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ సాగుతుంది.ఇవాళ లంచ్ బ్రేక్ వరకు వాదనలు సాగుతాయి. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.