12 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

12 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి  రంగం సిద్ధం

నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. ఈనెల 15న సిలబస్, నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 12,370 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 26వ తేదీ నుండి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. 45 రోజుల పాటు దరఖాస్తులకు గడువుందని చెప్పారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా 2018, జూన్ 12 కల్లా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 12, 370 ఉద్యోగాల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీ, భాషా పండితుల ఉద్యోగాలు 10, 313 ఉన్నాయి. తొలిదశలో మోడల్ స్కూళ్ళల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్ధుల కోసం మరో 860 ఉద్యోగులున్నాయని మంత్రి తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos