ఇంద్రకీలాద్రిపై అవినీతిని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ టెంటర్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఈవో సురేశ్‌పై విచారణ ప్రారంభించింది.

ఈవో పాత్రపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు దేవాదాయ శాఖ కమీషనర్. సెక్యూరిటీ సంస్థకు టెండర్ల విషయంలో కమీషనర్ ఆదేశాలను ఈవో బేఖాతరు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Also Read:దుర్గగుడిలో మరో ఇద్దరి సస్పెన్షన్: 15 మంది ఉద్యోగులపై వేటు

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సురేశ్‌పై చర్యలు తీసుకునే అవకాశం వుంది. ఏసీబీ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే 15 మంది సిబ్బందిపై వేటు వేసింది ప్రభుత్వం.

3 వెండి సింహాలు చోరీ జరిగినా మాక్స్ సంస్థకు టెండర్లు కట్టబెట్టడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు లేకుండా చేసిన చెల్లింపులపైనా తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమైంది. దుర్గగుడి ఈవో సురేశ్‌తో పాటు ఏఈవోలపై కూడా శాఖాపరమైన విచారణకు నిర్ణయం తీసుకుంది.