దుర్గగుడిలో మరో ఇద్దరి సస్పెన్షన్: 15 మంది ఉద్యోగులపై వేటు
దుర్గగుడిలో మరో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమాలకు పాల్పడినందుకు ఇప్పటికే 13 మంది ఉద్యోగులపై వేటు పడింది.
విజయవాడ: దుర్గగుడిలో మరో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమాలకు పాల్పడినందుకు ఇప్పటికే 13 మంది ఉద్యోగులపై వేటు పడింది.
తాజాగా మరో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో మొత్తం 15 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడినట్టైంది.గత వారంలో మూడు రోజుల పాటు దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో సమాచారం మేరకు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.
మ్యాక్స్ సెక్యూరిటీ టెండర్లలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై దేవాదాయ శాఖ వేటేసింది. సూపరింటెండ్ రవిప్రసాద్, పద్మావతి సస్పెన్షన్ వేటేసింది.మ్యాక్స్ సెక్యూరిటీ టెండర్ల విషయంలో ఈవో సురేష్ బాబు తన ఆదేశాలను కూడ పక్కన పెట్టారని దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు ప్రకటించారు.
ఈవో నియమ నిబంధనలను పక్కనపెట్టారని దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు గుర్తు చేసుకొన్నారు. ఏసీబీ అధికారుల సోదాల్లో దుర్గగుడిలో చోటు చేసుకొన్న అక్రమాలు వెలుగు చూశాయి.