ఆంధ్రప్రదేశ్  ప్రజలకు జగన్ సర్కార్ దిమ్మితిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇన్నిరోజులు వరాలు ప్రకటించిన జగన్... ఇప్పుడు తీసుకుంటున్న ఓ నిర్ణయం ఏపీ ప్రజలకు ఊహించిన "షాక్" ఇవ్వనుంది. 

ఏపీలో ఇన్నాళ్లు అందరికీ అందిన రేషన్ - పెన్షన్ అందేవీ.. కానీ ఇక పై కొత్త నిబంధనలతో అందకుండా పోతాయా అన్న టెన్షన్ జనాలను పట్టిపీడిస్తున్నాయి.  పెన్షన్ - రేషన్ కార్డుల్లో అక్రమార్కులను ఏరివేయడానికి జగన్ సర్కారు కరెంట్ బిల్లులకు లంకె పెట్టింది.

పెన్షన్, రేషన్ కార్డులను తొలగించడానికి, కొత్తవి మంజూరు చేయడానికి కరెంట్ బిల్లులను లింక్ పెట్టడంతో పెన్షనర్లకు, రేషన్ కార్డు వినియోగదారులకు ఇప్పుడు నిద్ర పట్టకుండా పోయింది. 

Also read: AP capital: ఏపీకి 3 రాజధానులు: జగన్ నిర్ణయం వెనకున్నది ఈయనేనా?

కరెంట్ వాడకం గనుక 200 యూనిట్లు దాటితే రేషన్ కట్, 300 యూనిట్లు దాటితే పెన్షన్ కూడా కట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వీటిపై నిఘా ఉంచి నివేదికలు అందించడానికి గ్రామ వాలంటీర్లు సహకారం తీసుకోనున్నారు. 

ఇకపోతే భార్యాభర్తల ఇద్దరి పేరు మీద ఉన్న ఆధార్ కార్డుతో అనుసంధానమైన అన్ని సర్వీసులను కలిపి ఒకటే యూనిట్‌ గా పరిగణిస్తారు. గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సర్వీసులన్నింటిని కలిపి ఒక యూనిట్‌గా అధికారులు పరిగణించనున్నారు. 

దీని ద్వారా ఇకపై విద్యుత్ కంపెనీ ఆయా ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళ పేర్ల మీదే సర్వీసులు మంజూరు చేస్తారు. ఇకపోతే ఇళ్లు అమ్ముకున్న వాళ్లకి, ఇంటిని వేరే వాళ్లకు అద్దెకి ఇచ్చి వేరే దగ్గర ఉంటున్న వారికి కూడా ఇబ్బందులు తప్పేలా కనపడడం లేదు. 

అద్దెకు ఉంటున్న వాళ్ళు గనుక ఎక్కువ కరెంటు ఉపయోగిస్తే, అది ఓనర్ల కొంపను కొల్లేరు చేయడం ఖాయం. సొంతిళ్లు ఉండి, దాన్ని అద్దె కు ఇచ్చే స్థాయిలో సదరు కుటుంబం ఉన్నప్పుడు వారికి కూడా పెన్షన్ అవసరమా అని అధికారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. 

Also read: పరిపాలనా రాజధానిగా భీమిలీ: మరో బాంబు పేల్చిన విజయసాయి

అంతేకాదు రేషన్ కార్డుల విషయంలో కూడా కొన్ని మార్పులు ఉండబోనున్నాయి. అర్హులు కాని వాళ్ళను తొలగించడానికి కొత్త సవరణలు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా టాక్సీ,  ట్రాక్టర్, ఆటోలు తప్ప మరే ఇతర నాలుగు చక్రాల వాహనం ఉన్న కూడా  వారి రేషన్ కార్డు ఇక గోవింద అన్నట్టే.