పరిపాలనా రాజధానిగా భీమిలీ: మరో బాంబు పేల్చిన విజయసాయి

మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ap executive capital bhimili, says ysrcp mp vijayasai reddy

మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా భీమిలి పరిపాలనా రాజధాని అవుతుందన్నారు. 

భీమిలి ప్రాంతంలోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని ఆయన విశాఖలో తెలిపారు. తద్వారా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని విజయసాయి ఆకాంక్షించారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం ఆశయమన్నారు.

Also Read:జగన్ మూడు రాజదానులు: పవన్ కల్యాణ్, నాగబాబులకు చిరంజీవి షాక్

మరోవైపు రాజధాని ప్రకటన నేపథ్యంలో అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏ ఒక్క రైతు నష్టపోరని విజయసాయి హామీ ఇచ్చారు. కాగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో విశాఖలో ఏ ప్రాంతంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తారనే పుకార్లకు తెర పడినట్లయ్యింది. 

జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది.ఈ సందర్భంగా కమిటీ ఛైర్మెన్ జీఎన్ రావుతో పాటు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

పరిపాలన కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించినట్టుగా జీఎన్ రావు కమిటీ  తెలిపింది. వరదముంపు లేని ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ సూచించింది. రాష్ట్రాన్ని  ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్‌లుగా విభజించాలని సూచించినట్టుగా జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.

Also Read:‘‘మెగా’’ కన్‌ఫ్యూజన్: జగన్‌కి జై కొట్టిన చిరు.. 4 బిల్డింగ్‌లతో అభివృద్ధి కాదన్న పవన్

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదికను రూపొందించినట్టుగా కమిటీ తేల్చి చెప్పింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇంకా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని జీఎన్ రావు కమిటీ తేల్చి చెప్పింది.  గత ప్రభుత్వం ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడ తాము పరిశీలించినట్టుగా తెలిపింది.

38 వేల మంది వినతులను పరిశీలించినట్టుగాజీఎన్ రావు తెలిపారు. సుమారు 2 వేల మంది రైతులతో తాను ప్రత్యక్షంగా  పరిశీలించినట్టుగా జీఎన్ రావు స్పష్టం చేశారు.అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను పరిశీలించినట్టుగా  కమిటీ తేల్చి చెప్పింది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం , వేసవి అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios