ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వం vs ఎన్నికల సంఘంగా తయారైంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎన్నికలు జరిపి తీరుతామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.... ప్రస్తుత పరిస్ధితుల్లో తమ వల్ల కాదని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా యుద్ధానికి దిగాయి.

ఈ పోరాటంలో ఉద్యోగులు బలైపోతున్నారు. ఎన్నికల విధులకు హాజరవ్వలేమని వారు ఇది వరకే నిమ్మగడ్డ దృష్టికి తీసుకొచ్చారు. అయితే  ఆయన వీటిని పట్టించుకోకపోగా.. భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్‌ను దాఖలు చేశాయి ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు. దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. సోమవారం విచారణ జరుపుతామని వెల్లడించింది. 

Also Read:పంచాయతీ రగడ: ఎస్ఈసీకి ద్వివేది, గిరిజా శంకర్ నోట్

అంతకుముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కి నోట్ పంపారు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున నిర్ణయం వెలువడే వరకు ఆగాలని అధికారులు ఎస్ఈసీని కోరారు.

వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని ప్రభుత్వం అంటోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం.

ఎన్నికలు తప్పనిసరి అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని కోర్ట్‌కు చెప్పనుంది ప్రభుత్వం. కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసే వరకైనా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోర్టును కోరనుంది ప్రభుత్వం.