Asianet News TeluguAsianet News Telugu

పంచాయతీ రగడ: ఎస్ఈసీకి ద్వివేది, గిరిజా శంకర్ నోట్

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కి నోట్ పంపారు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున నిర్ణయం వెలువడే వరకు ఆగాలని అధికారులు ఎస్ఈసీని కోరారు. 

panchayat raj officials sent note to ap sec over panchayat elections ksp
Author
Amaravathi, First Published Jan 22, 2021, 7:15 PM IST

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కి నోట్ పంపారు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున నిర్ణయం వెలువడే వరకు ఆగాలని అధికారులు ఎస్ఈసీని కోరారు.

వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని ప్రభుత్వం అంటోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం.

ఎన్నికలు తప్పనిసరి అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని కోర్ట్‌కు చెప్పనుంది ప్రభుత్వం. కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసే వరకైనా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోర్టును కోరనుంది ప్రభుత్వం. 

Also read:మెమోను బేఖాతరు చేసిన అధికారులు: ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన నిమ్మగడ్డ

అయితే ఎస్ఈసీ ముందు ఇవాళ పంచాయతీరాజ్‌శాఖ అధికారులు హాజరుకావాల్సి వుంది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ హాజరుకాకపోవడాన్ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సీరియస్‌గా పరిగణిస్తున్నారు.

చివరి అవకాశంగా 5 గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నిమ్మగడ్డతో భేటీకి ముందు సీఎం జగన్‌తో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, గిరిజాశంకర్ ఇతర అధికారులు సమావేశమయ్యారు. జగన్‌తో సమావేశమైన తర్వాత రమేష్‌‌కుమార్‌తో భేటీకి అధికారులు రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios