రాజధానిపై పిటిషన్ ఈ నెల 6న మెన్షన్ లిస్టులో చేర్చాలి: సుప్రీంను కోరనున్న ఏపీ సర్కార్
రాజధానిపై దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 6న మెన్షన్ లిస్ట్ లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు ఏపీ ప్రభుత్వం లేఖ రాయనుంది.
అమరావతి: రాజధానిపై దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 6వ తేదీన మెన్షన్ లిస్టులో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ ను ఏపీ ప్రభుత్వం కోరనుంది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయనుంది.
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను ఈ నెల 5న మెన్షన్ లిస్టులో చేర్చాలని ప్రభుత్వం ఆ లేఖలో కోరనుంది.
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది . 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది.
కాలపరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ది చేసి మూడు నెలల్లోపుగా భూ యజమానులకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. అమరావతి రాజధానిపై మాత్రం స్టే ఇవ్వలేదు. ఈ పిటిషన్ పై ఈ ఏడాది జనవరి 31న విచారణ జరగాల్సి ఉంది. అయితే ఆ రోజున బెంచ్ సమావేశం కాలేదు. దీంతో ఈ పిటిషన్ విచారణకు నోచుకోలేదు. దీంతో ఈ నెల 6న ఈ పిటిషన్ ను మెన్షన్ లిస్టులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది.
also read:మూడు రాజధానులు: రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఈ ఏడాది ఉగాది నుండి అమరావతి నుండి పాలనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ లోపుగానే రాజధాని అంశానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులను తొలగించుకోవాలని ప్రభుత్వం తలపెట్టింది. దరిమిలా అమరావతిపై దాఖలైన పిటిషన్ ను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కోరింది.