Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానులు: రేపు సుప్రీంకోర్టులో విచారణ

మూడు రాజధానుల అంశంపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్  చేస్తూ  సుప్రీంకోర్టులో  ఏపీ  ప్రభుత్వం దాఖలు  చేసిన  పిటిషన్ పై  రేపు విచారణ  నిర్వహించారు. 

Supreme Court  To Hear  on  Three Capital Cities  tomorrow
Author
First Published Jan 30, 2023, 4:31 PM IST

అమరావతి:మూడు రాజధానుల అంశంపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం  దాఖలు  చేసిన పిటిషన్ పై  రేపు  విచారణ జరగనుంది. 2022  సెప్టెంబర్  17వ తేదీన ఏపీ ప్రభుత్వం  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం  శాసనసభకు లేదని  గతంలో  ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పుపై స్టే ఇవ్వాలని  ఆ పిటిషన్ లో  కోరింది  ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్ పై  విచారణ నిర్వహించిన  సుప్రీంకోర్టు  గత ఏడాది నవంబర్  23న కొన్ని అంశాలపై  స్టే ఇచ్చింది.  

కాలపరిమితితో  రాజధానిని పూర్తి చేయాలని  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  స్టే ఇచ్చింది  సుప్రీంకోర్టు. అమరావతి రాజధాని ప్రాంతంలో  ప్లాట్లను  అభివృద్ది చేసి  మూడు నెలల్లోపుగా  భూ యజమానులకు ఇవ్వాలని  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  స్టే ఇచ్చింది. అమరావతి రాజధానిపై  మాత్రం స్టే ఇవ్వలేదు.  రేపు  ఈ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు  గత ఏడాది నవంబర్ లో  వాయిదా వేసింది.

2014లో  ఏపీలో  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో అమరావతిని  రాజధానిగా  ఏర్పాటు  చేశారు.  అయితే  జగన్  ఏపీలో అధికారంలోకి  వచ్చిన తర్వాత   మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.   అమరావతిని శాసన రాజధానిగా , కర్నూల్ ను  న్యాయ రాజధానిగా ,  విశాఖపట్టణాన్ని  పాలన రాజధానిగా  ఏర్పాటు  చేస్తామని  ప్రభుత్వం  ప్రకటించింది.

also read:మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

 అయితే  అమరావతిలోనే  రాజధానిని  కొనసాగించాలని  విపక్షాలు కోరతుున్నాయి.   అమరావతి రైతులు  ఆందోళనలు నిర్వహించారు.   పాదయాత్రలు  చేశారు.   అమరావతినే రాజధానిగా  కొనసాగించాలని  కోరుతూ   అమరావతి జేఏసీ, పలు పార్టీలు దాఖలు  చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు   కీలక తీర్పును ఇచ్చింది.  రాజధానిపై  చట్టం చేసే అధికారం  శాసభసభకు  లేదని  2022 మార్చి మాసంలో  ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.  ఈ తీర్పును సవాల్  చేస్తూ  ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేసింది.ఈ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో  విచారణ జరగనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios