విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడలోని గోవుల మరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గోవుల మరణం వెనుక ఉన్న మర్మాన్ని వెలికి తీసేందుకు సిట్ ఏర్పాటు చేశారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. సిట్ బృందంలో అధికారులను విజయవాడ ఏసీపీ ద్వార తిరుమల రావు నియమించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 

గోవుల మృతికి సంబంధించి పూర్తి వివరాలను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి అందజేయాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆఆదేశించారు.  ఇప్పటికే గోవుల మరణాల వెనుకు కుట్ర దాగి ఉందని విషప్రయోగం వల్లే గోవులు మరణించినట్లు  పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. 

మరోవైపు గోవుల మరణం అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక అంశంగా లేవనెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తున్నట్లు గోశాల యాజమాన్యం, గడ్డి కొనుగోలు వంటి అంశాలపై క్షుణ్ణంగా వివరాలు సేకరించాలని నిందితులను ఎట్టిపరిస్థితిలో ఉపేక్షించొద్దని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

105 ఆవుల మృతికి కారణమిదే: తేల్చిన వైద్యులు

విజయవాడలో కలకలం.. ఒకేసారి 100 ఆవులు మృతి (వీడియో)

గోవుల మృత్యుఘోష: పోస్టుమార్టంలో సంచలన విషయాలు, విషప్రయోగమే కారణమని నిర్థారణ