విజయవాడ: విజయవాడలోని గోశాలలలో ఆవులు మృతి చెందడంపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఆవులు తిన్న గడ్డిలో టాక్సిన్లు కలిసినట్టుగా పశు వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఏ రకమైన టాక్సిన్లు గడ్డిలో కలిశాయనే విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

శనివారం నాడు విజయవాడ గోశాలలో 105 ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఆవులు తీన్న గడ్డిలో టాక్సిన్లు కలిసినట్టుగా పశువైద్యాధికారులు గుర్తించారు.

అయితే ఈ టాక్సిన్లు ఏమిటనే విషయమై ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గోశాలలో ఉన్న ఆవులకు సరిపడ ఆహారం లేదు. ప్రస్తుతం గోశాలలో ఉన్న ఆవులన్నీ కూడ ఆరోగ్యంగానే ఉన్నట్టుగా పశువైద్యాధికారులు ప్రకటించారు.

పెద్ద సంఖ్యలో గోశాలలో్ని ఆవులు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన ఆవుల రక్త నమూనాలను పశువైద్యాధికారులు శనివారం నాడు సేకరించారు. ఈ నమూనాల ఆధారంగా ప్రాథమికంగా పశువైద్యాధికారులు ఓ నిర్ధారణఖు వచ్చారు. ఆవులు తిన్న గడ్డిలో టాక్సిన్లు ఉన్నట్టుగా గుర్తించారు. ఆదివారం నాడు పశువైద్యాధికారి దామోదరనాయుడు ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

 

సంబంధిత వార్తలు

విజయవాడలో కలకలం.. ఒకేసారి 100 ఆవులు మృతి (వీడియో)

గోవుల మృత్యుఘోష: పోస్టుమార్టంలో సంచలన విషయాలు, విషప్రయోగమే కారణమని నిర్థారణ