విజయవాడలో కలకలం రేగింది. ఒకేసారి 100 ఆవులు మృత్యువాత పడ్డాయి. కాగా... మరికొన్ని ఆవులు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాయి. విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

శుక్రవారం రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై గోశాల నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిలో ఏదో విషం కలిపి ఉంటారని అందుకే ఆవులు చనిపోయాయని వారు చెబుతున్నారు. కాగా... బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చనిపోయిన ఆవులను పరిశీలించారు.

ఒకేసారి ఇన్ని ఆవులు చనిపోవడంతో వాటిని పోస్టు మార్టం నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. గో మాతల చావుకి కారణాలు తెలుసుకుంటామని పోలీసులు చెప్పారు. గోశాల నిర్వాహకులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయోమేనని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక వేళ గొడవలు ఉంటే... కక్ష కట్టి ఇలా ఆవులను పథకం ప్రకారం చంపారేమో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కొద్ది రోజుల క్రితం ఇదే గోశాలలో 24 ఆవులు  చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

"