విజయవాడ: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన గోశాలలో ఆవుల మరణం వెనుక దాగి ఉన్న మర్మాన్ని బయటపెట్టారు వైద్యులు. విషప్రయోగం వల్లే ఆవులు మృత్యువాత పడినట్లు పోస్టుమార్టం ప్రిలిమినరీ నివేదికలో వెల్లడైంది. పొట్టఉబ్బరం వ్యాధితో ఆవులు మరణించలేదని విషప్రయోగం వల్లే చనిపోయాయని తెలిపారు.

ఇకపోతే విజయవాడలోని గోశాలలో శనివారం 105 గోవులు మృత్యువాతపడ్డాయి. ఒక్కసారిగా 105 ఆవులు మృతిచెందడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మూగజీవాలు మృత్యువాతపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. 

గోవుల మరణంపై వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవుల మరణంపై విచారణకు ఆదేశించారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఈ నేపథ్యంలో చనిపోయిన ఆవులకు గోశాలలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అక్కడే ఖననం కూడా చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.