కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఎస్ఈసీ నిర్ణయంపై ఆయన ఈ లేఖ రాశారు. ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లపై ఎస్ఈసీ అభిశంసన ఉత్తర్వులను పరిగణనలోనికి తీసుకోవద్దని సీఎస్ కోరారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఈసీ సెన్సుర్ ఆర్డర్ ఇచ్చారని సీఎస్ అభిప్రాయపడ్డారు. అధికారుల సెన్సుర్ ఆర్డర్‌పై చర్యలు తీసుకోవద్దని ఆదిత్యనాథ్ దాస్ కోరారు.

ఎస్ఈసీ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎస్ఈసీకి సూచించాలని సీఎస్ కేంద్రాన్ని కోరారు. 

పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఇచ్చిన ప్రొసిడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. ఈ మేరకు రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు జారీ చేసింది.

Also Read:నిమ్మగడ్డ‌కు షాక్: ఎస్ఈసీ ప్రోసిడింగ్స్ వెనక్కి, రెండు జీవోల జారీ

ఎన్నికల విధులకు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లు అనర్హులు అంటూ ఈ నెల 26వ తేదీన ప్రోసిడింగ్స్ జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీలో  నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ ప్రోసిడింగ్స్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

విదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఐఎఎస్  అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాదు సర్వీస్ రికార్డుల్లో ఈ విషయాలను నమోదు చేయాలని కూడ ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీ సర్కార్ తిప్పి పంపింది.

ఐఎఎస్ అధికారుల నుండి వివరణ తీసుకోకుండానే  ప్రొసిడింగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపింది. అధికారుల వివరణ తీసుకోకుండానే ప్రోసిడింగ్స్ ను ఎవరూ జారీ చేయలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్ఈసీ ప్రోసిడింగ్స్ ను వెనక్కి పంపింది. ఈ మేరకు గురువారం నాడు రెండు వేర్వేరు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.