Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ‌కు షాక్: ఎస్ఈసీ ప్రోసిడింగ్స్ వెనక్కి, రెండు జీవోల జారీ

పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఇచ్చిన ప్రొసిడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. ఈ మేరకు రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు జారీ చేసింది.

AP Government releases two GOs against AP SEC proceedings lns
Author
Guntur, First Published Jan 28, 2021, 10:22 AM IST


హైదరాబాద్: పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఇచ్చిన ప్రొసిడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. ఈ మేరకు రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు జారీ చేసింది.

ఎన్నికల విధులకు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లు అనర్హులు అంటూ ఈ నెల 26వ తేదీన ప్రోసిడింగ్స్ జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీలో  నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ ప్రోసిడింగ్స్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

also read:ఐఎఎస్ అధికారులపై ఎస్ఈసీ ప్రొసిడింగ్స్: తిప్పి పంపిన సర్కార్

విదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఐఎఎస్  అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాదు సర్వీస్ రికార్డుల్లో ఈ విషయాలను నమోదు చేయాలని కూడ ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీ సర్కార్ తిప్పి పంపింది.

ఐఎఎస్ అధికారుల నుండి వివరణ తీసుకోకుండానే  ప్రొసిడింగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపింది. అధికారుల వివరణ తీసుకోకుండానే ప్రోసిడింగ్స్ ను ఎవరూ జారీ చేయలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఎస్ఈసీ ప్రోసిడింగ్స్ ను వెనక్కి పంపింది. ఈ మేరకు గురువారం నాడు రెండు వేర్వేరు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios