ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి: ప్రధానితో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సీఎం జగన్ ప్రధాని మోడీతో చర్చించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం Ys Jagan సోమవారం నాడు Delhi కి వెళ్లనున్నారు. జల వివాదాలు, ప్రాజెక్టులపై ప్రధాని Narendra Modi తో జగన్ చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ ఇటీవలనే లేఖ రాసింది.ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, విభజన హామీలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం జగన్.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రధానిని కోరనున్నారు సీఎం జగన్.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది.
రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని కోరనున్నారు సీఎం జగన్. బీహార్ కి ప్రత్యేక హోదా పరిశీలన లో ఉందన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం జగన్. ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభలో చేసిన తీర్మానాన్ని ప్రధానికి సీఎం జగన్ అందించనున్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వరద సాయంలో జరిగిన అన్యాయాన్ని కూడా ప్రధాని కి వివరించనున్నారు సీఎం. వరదల సమయంలో తక్షణ సాయం కింద వేయి కోట్లు ఇవ్వాలని ప్రధానికి గతంలో సీఎం లేఖ రాసిన విషయం తెలిసిందే.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలని తక్షణం పరిష్కరించాలని కొరనున్న సీఎం.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి త్వరలో మరోమారు మూడు రాజధానులు బిల్లులు తీసుకువచ్చే అంశం పై ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్న జగన్.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించనున్నారు.Polavaram ప్రాజెక్టు సహా విభజన హామీలపై ప్రధానితో జగన్ చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన బకాయిల గురించి చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత షెడ్యూల్‌లోపుగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులను అందించాలని కూడా మోడీని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలకు సంబంధించిన నిధుల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా మోడీతో సీఎం జగన్ చర్చించనున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
also read:సీఎం జగన్ 30 నెలల పాలన పూర్తి.. సవాళ్లను తట్టుకుంటూ మేనిఫెస్టోలోని హామీలను పూర్తి చేశారు: సజ్జల
మరో వైపు ఏపీలో గత వారంలో బీజేపీ జనాగ్రహ సభను నిర్వహించింది. ఈ సభలో బెయిల్ పై ఉన్న నేతలంతా త్వరలోనే జైలుకు వెళ్తారని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వైసీపీ తీరుపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఈ వ్యాఖ్యల తర్వాత మోడీతో జగన్ భేటీ కానున్నారు.
మరో వైపు Andhra pradesh, Telangana రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇటీవల కాలంలో తీవ్రమయ్యాయి. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉందని కేసీఆర్ సఃర్కార్ వాదిస్తోంది.
కృష్ణా పరివాహక ప్రాంతంలోని నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలో సాగు, తాగు నీటి కొరత ఏర్పడే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి లిఫ్ట్ పనులపై కూడాత ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతుంది.గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుపై కూడా ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రానికి ఫిర్యాదు చేసింది..
గత వారంలోనే జల వివాదాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించింది. ఈ నెల 12న రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. ఈ మేరకు ఈ సమావేశానికి రావాలని రెండు రాష్ట్రాల సీఎస్ కు కేంద్ర హోం శాఖ సెక్రటరీ ఇటీవల లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రెండు రాష్ట్రాలకు విభజన హామీలను ఇచ్చింది. అయితే ఈ హామీలు పూర్తిగా అమలు కాలేదు. ఈ తరుణంలో ఈ హమీలను అమలు చేయాలని కోరుతూ రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని పలు మార్లు కోరాయి. అయితే కేంద్ర హోంశా నిర్వహించే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని రెండు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి