Asianet News TeluguAsianet News Telugu

లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై జగన్ సెటైర్లు

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  ఏపీ సీఎం వైఎస్ జగన్  తీవ్ర విమర్శలు చేశారు.  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై  జగన్ సెటైర్లు వేశారు. మహిళలంటే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని  జగన్ మండిపడ్డారు.

AP CM YS Jagan Satirical Comments on Pawan Kalyan Marriages in Kakinada meeting lns
Author
First Published Oct 12, 2023, 1:00 PM IST

కాకినాడ: దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదాబాద్ అని... కానీ ఆయన ఇల్లాలు మాత్రం మూడేళ్లకో, నాలుగేళ్లకో ఒకసారి మారుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు

 కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో  వైఎస్ఆర్ జగనన్న కాలనీలో  లబ్దిదారులకు సీఎం జగన్ గురువారం నాడు ఇళ్లను అందించారు.లబ్దిదారులతో కలిసి సామూహిక గృహా ప్రవేశాలను చేయించారు జగన్. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు దత్తపుత్రుడి స్టోరీ మీకు తెలిసిందేనంటూ  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని  సీఎం జగన్ విమర్శలు చేశారు.

ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ  పవన్ కళ్యాణ్ భార్యల గురించి  ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్  పరోక్షంగా  సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి మహిళలపై ఉన్న గౌరవమని  సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.వివాహ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ గౌరవం లేదన్నారు. ప్యాకేజీ స్టార్ కు గాజువాక, భీమవరంతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ పై  విమర్శలు చేశారు సీఎం జగన్.

also read:సామూహిక గృహా ప్రవేశాలు: సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేసిన జగన్

సరుకులను అమ్ముకొనే వాళ్లను చూశాం.. కానీ స్వంత పార్టీని అమ్ముకొనే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామని  పవన్ కళ్యాణ్ పై  పరోక్ష విమర్శలు చేశారు సీఎం జగన్.అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకొనేందుకే ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారని పవన్ పై జగన్ ఆరోపణలు చేశారు.స్వంత పార్టీని, స్వంత వర్గాన్ని అమ్ముకొనే వ్యాపారి అని పవన్ కళ్యాణ్ పై  జగన్  విమర్శలు చేశారు.రెండు షూటింగ్ ల మధ్య అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి పోతుంటారని పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడ ఆలోచించాలని జగన్ కోరారు.రాష్ట్రంపై ప్రేమ లేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios