సామూహిక గృహా ప్రవేశాలు: సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేసిన జగన్
కాకినాడ జిల్లా సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు ఇళ్లను ఏపీ సీఎం జగన్ ఇవాళ అందించారు.
కాకినాడ: జిల్లాలోని సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు ఇళ్లను సీఎం జగన్ అందించారు. లబ్దిదారులతో సీఎం సామూహిక గృహా ప్రవేశాలు చేయించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా సామర్లకోటలో నిర్మించిన ఇళ్లను సీఎం జగన్ లబ్దిదారులకు గురువారంనాడు అందించారు. లబ్దిదారులతో గృహా ప్రవేశం చేయించారు. రాష్ట్రంలో 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. 71,811. 49 ఎకరాల భూమిని పేదలకు జగన్ సర్కార్ పంపిణీ చేసింది. నవరత్నాల పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా 30.75 లక్షల మందికి జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది.ఈ భూముల్లో ఇళ్లను నిర్మించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్లను ఇప్పటివరకు ప్రభుత్వం నిర్మించింది. సామర్లకోటలో లబ్దిదారులతో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2024 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఎవరూ ఉండకూడదనే లక్ష్యంతో జగన్ సర్కార్ ఈ పథకాన్ని చేపట్టింది.26 జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పథకం అమలు తీరును పరిశీలించేందుకు అధికారులను కూడ ప్రభుత్వం నియమించింది.
వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 56,700 కోట్లు ఖర్చు చేస్తుంది. ఒక్కో ఇంటి ధర కనీసం రూ. 15 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆయా జిల్లాల్లోని మార్కెట్ విలువ ప్రకారంగా ధరల్లో వ్యత్యాసాలుంటాయి.