Asianet News TeluguAsianet News Telugu

ఏపీ: రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులు.. మీట నొక్కి విడుదల చేసిన జగన్

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం (ap cm) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan). మంగళవారం ఆయన (ysr rythu bharosa 2nd installment) వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులను (pm kisan) విడుదల చేశారు.

ap cm ys jagan released ysr rythu bharosa scheme funds to farmers
Author
Amaravati, First Published Oct 26, 2021, 12:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం (ap cm) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan). మంగళవారం ఆయన (ysr rythu bharosa 2nd installment) వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులను (pm kisan) విడుదల చేశారు. వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ (ysr sunna vaddi), వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం (ysr yantra seva).. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. మూడో ఏడాది రెండో విడత నిధులు విడుదల చేస్తున్నామని.. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని జగన్‌ అన్నారు.  

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిందని సీఎం ఎద్దేవా చేశారు. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోందని.. కరోనా సవాల్‌ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని జగన్ గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చామని జగన్ చెప్పారు. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశామని... ఈ-క్రాపింగ్‌ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

Also Read:జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

కాగా.. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద 2019 నుంచి ప్రతి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీనిలో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్‌లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios