Asianet News TeluguAsianet News Telugu

ఉగాది నుండే విశాఖ నుండి పాలన: ఏపీ సీఎం జగన్ కసరత్తు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ నుండి పాలన సాగించనున్నారు. ఈ మేురకు  ఏర్పాట్లు  చేసుకుంటున్నారు. ఉగాది నుండి జగన్  విశాఖ నుండి పాలన సాగించే అవకాశాలు లేకపోలేదు.  
 

AP CM YS Jagan Plans To  Shift  Camp office  Visakhapatnam  From  Ugadi
Author
First Published Jan 31, 2023, 1:52 PM IST

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్   ఉగాది నుండి  విశాఖపట్టణం నుండి పాలనను సాగించేందుకు  కసరత్తు చేస్తుంది.  తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం కానుంది.  దీంతో అదే రోజున  విశాఖ నుండే  పాలనను సాగించాలని జగన్ సర్కార్  భావిస్తుంది.  

ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్  ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో  విశాఖపట్టణం ఏపీకి రాజధానిగా మారనుందని  చేసిన వ్యాఖ్యలు  చర్చకు దారి తీశాయి.  ఏపీలో  జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని  వైసీపీ సర్కార్ తెరమీదికి తీసుకువచ్చింది. 

also read:ఏపీకి త్వరలో విశాఖపట్టణం రాజధాని: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్

విశాఖపట్టణం నుండి పాలన సాగించాలని   ఉత్తరాంధ్ర  నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు  సీఎం జగన్ ను కోరుతున్నారు.  ఉగాది నుండి  విశాఖ నుండి పాలన సాగించాలని మంత్రులు  జగన్ ను కోరారు.  దీంతో  ఉగాది నుండి  పాలన సాగించేందుకు  కసరత్తు సాగుతుందని  సీఎం జగన్  వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది.   ఉగాది నుండి  పాలన  సాగించాలని మంత్రులు  కోరితే  జగన్  సానుకూలంగా  స్పందించారు.ఈ విషయాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ   చెప్పారు.  మరో రెండు మాసాల్లోనే  విశాఖ నుండి పాలన సాగించాలని  జగన్ పట్టుదలగా  ఉన్నట్టుగా  ప్రభుత్వం నుండి సంకేతాలు వెలువడుతున్నాయి.ఈ దిశగా  అధికార పార్టీ నేతలు, ఉత్తరాంధ్రకు చెందిన  మంత్రులు  విశాఖ నుండి పాలన  త్వరలోనే ప్రారంభం కానుందని  చెబుతున్నారు.  విశాఖపట్టణం  త్వరలోనే రాజధానిగా మారనుందని  సీఎం జగన్  చేసిన వ్యాఖ్యలు  ఇందుకు  ఊతమిస్తున్నాయి.  

ఏపీలో  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చింది.  అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖపట్టణాన్ని  పాలనా రాజధానిగా  ఏర్పాటు  చేయాలని  జగన్  సర్కార్ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు  అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా  వైసీపీ  ప్రకటించింది.  

చంద్రబాబునాయుడు  ఏపీకి సీఎంగా  ఉన్న సమయంలో  అమరావతిని  రాజధానిగా  ప్రకటించారు.  రాజధానికి  శంకుస్థాపన కూడా చేశారు.  ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హజరయ్యారు.  రాష్ట్రంలోని విపక్షాలన్నీ కూడ  అమరావతిలోనే రాజధానిగా  కొనసాగించాలని  కోరుతున్నాయి.  వైసీపీ సర్కార్ విధానాన్ని వివక్షాలు తప్పుబడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios