ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటి రెండేళ్లు పూర్తవుతుంది. 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సీఎం బహిరంగ లేఖ రాయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంప్ కార్యాలయంలో లేఖ విడుదల చేయనున్నారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను లేఖలో వివరించనున్నారు.

Also Read:ఏపీలో 16 చోట్ల హెల్త్ హబ్‌లు.. ఒక్కో హబ్‌కు 50 ఎకరాలు: జగన్ కీలక నిర్ణయం

కాగా, దేశ వ్యాప్తంగా ఏడు విడ‌త‌ల్లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు 2019, మే 23న వెలువ‌డ్డాయి. వైసీపీ 151 అసెంబ్లీ, 23 పార్ల‌మెంట్ స్థానాల‌తో తిరుగులేని ప్ర‌జాద‌ర‌ణ‌తో అధికారంలోకి వ‌చ్చింది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ కేవ‌లం 23 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాల‌తో స‌రిపెట్టుకుని అత్యంత పేల‌మైన ఫ‌లితాలు సాధించింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చ‌రిత్రలో ఇదో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలింది. వైసీపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధానంగా జ‌గ‌న్ త‌ల పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్రం కీల‌క పాత్ర పోషించింది.