ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాలంటీర్లకు ముఖ్యమంత్రి ఐడీ కార్డులు అందజేశారు. అనంతరం వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వాలంటీర్లు తెలిపారు.

గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)