పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఈ సమావేశంలోనే ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్ట్‌ల పూర్తి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను పూర్తి చేస్తున్నట్లు అధికారులు చెప్పగా.. గొట్టా బ్యారేజ్ నుంచి కూడా లిఫ్ట్ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఇదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను జగన్ అభినందించారు.
ALso Read: నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: పోలవరం పనులపై జగన్ సమీక్ష
అంతకుముందు ఈ నెల 6న పోలవరం ప్రాజెక్ట్ పనులను సీఎం పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డయాఫ్రంవాల్ పూర్తైతే మెయిన్ డ్యాం పనులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరంతో నిర్వాసిత కుటుంబాలకు నిర్మించే పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఏం జగన్ ఆదేశించారు. నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించినట్టుగా అధికారులు సీఎం కు చెప్పారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని సీఎం సూచించారు
