ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని రజత పతకం సాధించిన తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ప్రోత్సాహకం ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
అమరావతి: ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (international badminton championship)లో తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్ (kidambi srikanth) రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ అద్భుత ప్రదర్శనతో సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రజత గెలిచిన తొలి భారత షట్లర్ గా శ్రీకాంత్ నిలిచాడు.
ప్రపంచ క్రీడా వేదికపై దేశ ప్రతిష్టను మరింత పెంచిన శ్రీకాంత్ పై దేశప్రజలు ప్రశంసలు జల్లు కురుస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ (ys jaganmohan reddy) కూడా కిందాంబి శ్రీకాంత్ ను సాదరంగా సత్కరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తల్లిదండ్రులతో కలిసి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి అభినందించారు సీఎం.
Video
తెలుగుతేజం శ్రీకాంత్ ను కేవలం సన్మానంతో సరిపెట్టకుండా ప్రోత్సాహకంగా రూ. 7 లక్షల నగదు బహుమతిని సీఎం ప్రకటించారు. అలాగే బ్యాడ్మింటన్ అకాడమీ (badminton academy) ఏర్పాటు కోసం తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. వెంటనే క్రీడా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (avanthi srinivas), శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి (byreddy siddharth reddy) చెక్కును శ్రీకాంత్ కు అందజేసారు.
read more Kidambi Srikanth: శ్రీకాంత్ కు తెలంగాణ ప్రభుత్వం అభినందన.. త్వరలోనే భారీ నజరానా..?
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను వారి చిన్న తమ్ముడిలాంటి వాడినని... ఏ అవసరం ఉన్నా సీఎం కార్యాలయంతో కాంటాక్ట్‌లోకి రాగానే వెంటనే సాయం చేస్తానని భరోసా ఇచ్చారన్నారు. ఇది చాలా పెద్ద సపోర్ట్ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

''తిరుపతిలో ఐదెకరాల భూమిని అకాడమీకి ఇవ్వడం సంతోషకరం. ఇందుకు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా స్పోర్ట్స్ విషయంలో నాకు ఏ అవసరం వచ్చినా వెంటనే ఏపీ ప్రభుత్వం సాయం చేస్తోంది. కాబట్టి కచ్చితంగా నేను రాష్ట్రానికి నా వంతు సాయం చేస్తాను'' అన్నారు.

''ఏపీ ప్రభుత్వం నాకు ఇచ్చిన భూమిలో వరల్డ్ క్లాస్ అకాడమీని ఏర్పాటుచేసి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్‌ని తీర్చిదిద్దుతాను. ప్రభుత్వం క్రీడాకారుల విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద వల్ల క్రీడాకారులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఒలింపిక్స్ ఆడిన వారు, ఆ తర్వాత లెవల్‌లో ఆడిన వారికి క్రీడల పరంగా ఎలాంటి అవసరం ఉన్నా సీఎం వెంటనే చర్యలు తీసుకుంటున్నారు'' అని శ్రీకాంత్ వెల్లడించారు.
read more BWF World Championships 2021: శ్రీకాంత్ కు భంగపాటు.. ఫైనల్లో కిన్ దే విజయం.. మహిళల విజేత యమగుచి
''ఒక స్పోర్ట్స్ ప్లేయర్‌గా నాకు ఇలాంటి సపోర్ట్ దొరకడాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను. క్రీడాకారులందరి తరపునా కూడా సీఎం జగన్ కి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్‌లో మరిన్ని టోర్నమెంట్‌లలో గెలిచి రాష్ట్రానికి మరింత పేరు తీసుకొచ్చేలా కృషిచేస్తాను'' అని శ్రీకాంత్ తెలిపారు.
