అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కుట్ర పన్నుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించిన చంద్రబాబు ఏపీపై కుట్రకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చినట్లుత స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైఎస్ జగన్‌ రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. 

రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే ముగ్గురు నేతల ఆలోచన అని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే వైఎస్ జగన్ ను సామంతరాజును చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వారి కుప్పిగంతులు తన వద్ద సాగవన్నారు. 

ఏపీపై ద్వేషం నిత్యం ద్వేషం చూపించే కేసీఆర్, కేటీఆర్ లు జగన్ పై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్, మోదీలతో వైఎస్ జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

మరోవైపు రాష్ట్రాన్ని మరో బిహార్‌ చేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ సూచనలతో జగన్ కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కు ఏపీ అంటే ద్వేషం, తోలుబొమ్మను చేసి ఆడుకోవాలనుకుంటున్నాడు: చంద్రబాబు ఫైర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యం: చంద్రబాబు