ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తన కుమారుడు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ ని అభినందించారు. బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా జాతీయస్థాయిలో 22 స్కోచ్ అవార్డులు సాధించినందుకు మంత్రి లోకేష్‌ను, అధికారులను సీఎం అభినందించారు. అలాగే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు పంచాయతీరాజ్‌ శాఖను మెచ్చుకున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు.

 ప్రతి పంచాయతీ ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. నాలుగేళ్లలో గ్రామాల్లో 17 వేల కి.మీ. సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఏడాదిలో మరో 8 వేల కి.మీ. రోడ్లు నిర్మించి 25 వేల కి.మీ లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.