Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బృందంతో సీఎం భేటీ: కేంద్రంపై చంద్రబాబు అసంతృప్తి

తిత్లీ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ తుఫాను విషయంలో కేంద్రం  వెంటనే స్పందించలేదనంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తుఫాను సంభవించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కనీసం తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ap cm chandrababu meeting with central team
Author
Amaravathi, First Published Oct 26, 2018, 8:19 PM IST

తిత్లీ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ తుఫాను విషయంలో కేంద్రం  వెంటనే స్పందించలేదనంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తుఫాను సంభవించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కనీసం తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిత్లీ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందంతో రాజధాని అమరావతిలో చంద్రబాబు భేటీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుఫాను ప్రాంతాల్లో బృందం జరిపిన పర్యటన గురించి చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. అలాగే ఈ తుఫాను బీభత్సం గురించి వారికి వివరించారు.  రాష్ట్ర ప్రభుత్వ  అంచనా ప్రకారం తిత్లీ తుఫాను వల్ల రాష్ట్రం దాదాపు రూ.3673 కోట్లు నష్టపోయినట్లు చంద్రబాబు తెలిపారు.  

అందువల్ల ఏపికి న్యాయం జరిగేలా కేంద్రం దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లాలని సీఎం వారికి కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం రెండు, మూడు రోజుల్లోనే సాయం అందేలా చూస్తామన్న హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

మరిన్ని  వార్తల

తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట

తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోండి: ప్రజలకు చంద్రబాబు లేఖ

తిత్లీ ఎఫెక్ట్: బాధితులకు జీవిత, రాజశేఖర్ పదిలక్షల సాయం!

‘‘తిత్లీ’’ తుఫాను బాధితులకు అన్నదమ్ముల సాయం
 
Follow Us:
Download App:
  • android
  • ios