Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్‌తో బేటీ: ఇదీ మా ప్లాన్, తేల్చేసిన బాబు

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేసేంతవరకు కేంద్రంపై  పోరాటం ఆగదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహాన్‌కు తేల్చి చెప్పినట్టు సమాచారం

Ap chief minister Chandrababu Naidu meets governor at Vijayawada
Author
Amaravathi, First Published Aug 23, 2018, 12:01 PM IST

అమరావతి: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేసేంతవరకు కేంద్రంపై  పోరాటం ఆగదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహాన్‌కు తేల్చి చెప్పినట్టు సమాచారం.రెండు గంటలకు పైగా  గవర్నర్ నరసింహాన్‌తో చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి విజయవాడలో సమావేశమయ్యారు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహారించుకొన్న తర్వాత గవర్నర్ నరసింహాన్‌తో సుమారు రెండు గంటలకు పైగా చంద్రబాబునాయుడు సమావేశం కావడం ఇదే తొలిసారి. రాష్ట్రానికి ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రం పట్ల కేంద్రం థృక్పథం మారనంత వరకు కేంద్రంపై తమ తీరు ఇలానే ఉంటుందని గవర్నర్‌కు బాబు స్పష్టం చేశారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కూడ ఇదే వైఖరిని అవలంభించనున్నట్టు  బాబు స్పష్టం చేసినట్టు సమాచారం.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన హమీని మోడీ సర్కార్ అమలు చేయలేదని... కేంద్రం రాష్ట్రానికి  అన్యాయం చేసిందనే  అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నందునే తాము బీజేపీ సర్కార్‌కు మద్దతును ఉపసంహరించుకొన్నట్టు బాబు వివరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉన్నట్టు చంద్రబాబునాయుడు గవర్నర్‌కు సూచన ప్రాయంగా  వెల్లడించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వరదలతో  వాటిల్లిన నష్టాలపై  నివేదికను గవర్నర్‌కు  అందించినట్టు చెప్పారు.

తమ నిర్ణయాలన్నీ  బహిరంగంగా ఉంటాయని కూడ బాబు స్పష్టం చేసినట్టు సమాచారం. తెలంగాణలో కూడ పార్టీని కాపాడుకొనే ఉద్దేశ్యంతోనే  తమ నిర్ణయాలు ఉంటాయని కూడ బాబు మాటల సందర్భంలో వెల్లడించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్త చదవండి

గవర్నర్ తో చంద్రబాబు భేటీ: మంత్రివర్గ విస్తరణపై పుకార్ల జోరు
 

Follow Us:
Download App:
  • android
  • ios