అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారంనాడు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ అమరావతికి వచ్చారు. 

ఈ సందర్భంలో గవర్నర్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించారనే పుకార్లు జోరందుకున్నాయి. మైనారిటీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 

త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. దాంతో గవర్నర్ తో చంద్రబాబు భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెండింగు ప్రాజెక్టులపై, పోలవరం వివాదాలపై చంద్రబాబు గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది.