విశాఖపట్టణం: ఈ నెల 27వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం విశాఖపట్టణంలో  నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే  విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీకి కేబినెట్  ఆమోదం తెలపనుంది.

Also read:ఫేక్ లెటర్స్ తో నాకు సంబంధం లేదు.. 3 రాజధానులపై చిరంజీవి క్లారిటీ!

ఏపీకి రాజధానుల విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇటీవలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చారు. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించాలని కమిటీ సూచించింది.

also read:ఏపీకి మూడు రాజధానులు: పవన్‌కు షాకిచ్చిన చిరు, జగన్ జై

కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ, అమరావతిలలో హైకోర్టు బెంచ్‌లు కూడ ఏర్పాటు చేయాలని కమిటీ  సూచించింది. ఈ తరుణంలో విశాఖలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  

విశాఖలో లులు గ్రూపుకు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొంది. ఐదెకరాల స్థలంలో బీచ్ రోడ్డులో ఈ ఫంక్షన్ హాల్ ఉంది. గత ప్రభుత్వం ఈ ఫంక్షన్ హాల్ ను లులు గ్రూప్‌కు కేటాయించింది. ఈ అనుమతులను జగన్ సర్కార్ రద్దు చేసింది. 

also read‘‘మెగా’’ కన్‌ఫ్యూజన్: జగన్‌కి జై కొట్టిన చిరు.. 4 బిల్డింగ్‌లతో అభివృద్ధి కాదన్న పవన్

ఐదెకరాల స్థలంలో ఉన్న ఈ ఫంక్షన్ హాల్‌లో మంత్రిర్గ సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత లేదు. పార్కింగ్ సమస్య కూడ లేకుండా ఉండేందుకు ఈ స్థలాన్ని ఎంపిక చేశారని అంటున్నారు. ఫంక్షన్‌హాల్‌కు అనుకొని ఉన్న 11 ఏపీఐఐసీ భూమి కూడ ఉంది. విశాఖలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు విషయమై ఈ నెల 25వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.