అమరావతి:రాయలసీమ ప్రత్యేక అభివృద్ధి కోసం కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకొందని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. 

బుధవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం వివరాలను ఏపీ మంత్రి పేర్ని నాని అమరావతిలో మీడియాకు వివరించారు.కీలక అంశాలపై  కేబినెట్ అంశాలపై చర్చించినట్టుగా ఆయన తెలిపారు. 

also read:అరుకు సైతం, కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటి: ఏపీ కేబినెట్ నిర్ణయం

వైఎస్ఆర్ చేయూత పథకం కింద వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మందికి మహిళలకు వర్తింపచేయనున్నట్టుగా మంత్రి తెలిపారు.మొదటి విడతలో స్కూల్స్ నాడు నేడు కార్యక్రమానికి రూ. 920 కోట్లను విడుదల చేసినట్టుగా ఆయన చెప్పారు. రానున్న రెండేళ్లలో అన్ని పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో సీసీఎల్ఏ, జీఏడీ, ప్లానింగ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. సీఎంఓ ప్రతినిధి కూడ ఉంటారని మంత్రి చెప్పారు.

ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ఒంగోలు, శ్రీకాకుళంలలో ఉద్యోగాల భర్తీ కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సీపీఎస్ పెన్షన్ స్కీమ్  వద్దని ఆందోళన చేసిన ఉద్యోగులపై బనాయించిన కేసులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకొందన్నారు.మైనింగ్ కార్యక్రమాలకు సంబంధించి శాండ్ కార్పోరేషన్ పర్యవేక్షించనుందని చెప్పారు.