Asianet News TeluguAsianet News Telugu

టిటిడిలో రాజకీయాలకు చెక్... బోర్డులో కేవలం స్వామీజీలే: సోము వీర్రాజు

రాష్ట్రంలో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని...లేదంటే కేంద్రం కఠినంగా వ్యవరించాల్సి వస్తుందని ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు హెచ్చరించారు. 

AP BJP Chief Somu Veerraju once again reacts on antarvedi chariot catch fire
Author
Visakhapatnam, First Published Sep 8, 2020, 1:08 PM IST

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలు పై దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ దేవాలయాల్లో ఒకటయిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే రాష్ట్ర ప్రజలు ఎంతో ఆవేదనకు గురయ్యారని అన్నారు. అంతకుముందు బిట్రగుంట, పిఠాపురంలలో కూడా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయని వీర్రాజు గుర్తు చేశారు. 

''అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలా రాష్ట్రంలో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి. లేని పక్షంలో కేంద్రం కఠినంగా వ్యవరించాల్సి వస్తుంది'' అని హెచ్చరించారు. 

''రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్న... అసలు మీరు హిందుత్వాన్ని పరిరక్షింస్తారా... లేదా? తేల్చి చెప్పాలి. రాష్టంలో దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలుపై బీజేపీ తరపున  ఒక కమిటీ వేస్తాం'' అని వెల్లడించారు. 

read more   అంతర్వేది స్వామివారి రథం దగ్ధం... జగన్ సర్కార్ సీరియస్, ఈవోపై వేటు

''ఇక అంత్యర్వేది ఘటనపై టిడిపి మాట్లాడే హక్కు లేదు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో ఎన్నో దేవాలయాలు టిడిపి ప్రభుత్వం కూల్చి వేసింది. టిడిపి, వైసిపిలు మతతత్వ రాజకీయాల పంథాలలో వెళ్తున్నాయి. టిడిపి మేనిఫెస్టోలో సైతం క్రైస్తవులు మేలు చేసే అంశాలు ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్చి నిర్మాణం కోసం నిధులు ఇస్తోంది'' అని ఆరోపించారు. 

''టిడిపి, వైసీపీ, వాళ్ళకి సవాల్ చేస్తున్నా. టిటిడి నిధులతోనే దేవాలయ నిర్మాణం చేస్తాం అంటున్నారు. అలాగే కేవలం చర్చిలకి వచ్చే ఆదాయంతోనే చర్చిలు నిర్మాణం చేయగలరా? చర్చిలు ఆస్తుల పై కమిటీలు వేయగలరా?'' అని ప్రశ్నించారు. 

''ఇక టిటిడి బోర్డ్ లో రాజకీయ నాయకులు కాకుండా కేవలం స్వామీజీలను నియమించాలని నిర్ణయించాం. 2024 ఎన్నికల్లో అన్ని మతాలకు మేలు చేసేలా మేనిఫెస్టో రూపొందిస్తాం. మతాల ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్రం లో హిందుత్వానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు వ్యవరించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు. 

''టీడీపీ ,వైసీపీ పార్టీ లు కుటుంబ పార్టీలు. రాష్ట్రం లో దేవాలయాలు భూములు విషయంలో ప్రభుత్వం జిఓ లు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒక సెంటు దేవాలయం భూమి అన్యాక్రాంతం అయిన బీజేపీ ఒప్పుకోదు. అంతర్విది సంఘటనపై వెంటనే సిట్టింగ్ న్యాయమూర్తి తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కి నేను లేఖ రాసాను'' అని వీర్రాజు గుర్తు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios