అమరావతి: దేశంలోనే అత్యంత చెత్త ఇంగ్లీషు మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు ఉంటారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధనపై జరిగిన చర్చల్లో చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం అత్యవసరమన్నారు. 

స్పీకర్ ను మర్యాదగా ఉండదన్న చంద్రబాబు: ఖవాళీ డాన్స్ కాదంటూ తమ్మినేని వార్నింగ్..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించేది దళితులు, బడుగులు, బలహీన వర్గాల పిల్లలేనని వారు ఇంగ్లీషు మీడియంకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యాబోధన సరైన నిర్ణయమన్నారు. 

రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన చంద్రబాబుపై గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి దొరికిన ఆడియోలో చంద్రబాబు వాయిస్ విన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయాలను గుర్తు చేశారు.

చంద్రబాబు అత్తకు కేబినెట్ హోదా ఇచ్చాం: సభలో జగన్ పంచ్...  

దేశంలో అత్యంత చెత్త ఇంగ్లీషు మాట్లాడేది చంద్రబాబు తప్ప ఇంకెవరు అంటూ కేటీఆర్ అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. కనీసం ఇంగ్లీషు కూడా మాట్లాడలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని అలాంటి పరిస్థితి ఇకపై ఎవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టారంటూ చెప్పుకొచ్చారు చెవిరెడ్డి. 

గతంలో వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారంటూ ఆరోపించారు. ఇంగ్లీషు మీడియం విషయంలో చంద్రబాబు అండ్ టీం పిల్లల భవిష్యత్ తో చెలగాటం ఆడవద్దని సూచించారు చెవిరెడ్డ భాస్కర్ రెడ్డి. 

పవన్ కు ఝలక్: జగన్ ను సమర్థించిన జనసేన ఎమ్మెల్యే రాపాక...