చంద్రబాబు అత్తకు కేబినెట్ హోదా ఇచ్చాం: సభలో జగన్ పంచ్
రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ లకు చైర్మన్ల నియామకం జరిగిందన్నారు సీఎం జగన్. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా, ఏపీ ఐఐసీ చైర్మన్ గా ఆర్ కే రోజా, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా నందమూరి లక్ష్మీ పార్వతిలను నియమించామని చెప్పుకొచ్చారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు కట్టబెట్టామని టీడీపీ ఆరోపించడంతో చంద్రబాబు అత్తకు కూడా తాను నామినేటెడ్ పోస్టు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు సీఎం జగన్.
నామినేటెడ్ పోస్టులు, సిఈవోలు, ప్రభుత్వ సలహాదారులుగా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అనగాని సత్యప్రసాద్ ఆరోపణలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదరించిందని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలా ఒకే సామాజిక వర్గానికి పనిచేయడం లేదని మండిపడ్డారు.
స్పీకర్ ను మర్యాదగా ఉండదన్న చంద్రబాబు: ఖవాళీ డాన్స్ కాదంటూ తమ్మినేని వార్నింగ్...
ప్రభుత్వం నియమించిన నియామకాల్లో కూడా రిజర్వేషన్లు పాటించామని చెప్పుకొచ్చారు. బడుగులు, బలహీన వర్గాల వారికి న్యాయం చేసేలా అన్నిరంగాల్లో పదవులు ఇచ్చినట్లు జగన తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ బీసీలకు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయని ఎన్నికల అనంతరం కార్పొరేషన్ చైర్మన్ నియామకాలు కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 160 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించాల్సి ఉందని తెలిపారు సీఎం జగన్.
ఇకపోతే రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ లకు చైర్మన్ల నియామకం జరిగిందన్నారు సీఎం జగన్. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా, ఏపీ ఐఐసీ చైర్మన్ గా ఆర్ కే రోజా, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా నందమూరి లక్ష్మీ పార్వతిలను నియమించామని చెప్పుకొచ్చారు.
నందమూరి లక్ష్మీపార్వతి స్వయానా చంద్రబాబు నాయుడుకు అత్తగారేనని చెప్పుకొచ్చారు సీఎం జగన్. చంద్రబాబు అత్తను ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా నియమించినట్లు జగన్ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతికి పదవి ఇచ్చామని చెప్పుకొచ్చారు. లక్ష్మీపార్వతికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వకపోగా కనీసం గౌరవించ లేదన్నారని తాము మాత్రం పదవి ఇచ్చి గౌరవించామని చెప్పుకొచ్చారు సీఎం జగన్.
బాబు! మిమ్మల్ని చూసి మేం ఏం నేర్చుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం..